వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని కాంగ్రెస్ నాయకత్వం చాలా ధీమాగా ఉంది. చాలా జిల్లాల్లో దానికి తగ్గట్టే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి కొందరు మంచి ముహూర్తం కోసం వేచిచూస్తున్నారు. ఇంకొందరైతే తమకి టికెట్ గ్యారంటీ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇంతటి ఊపులోనూ ఒక్క జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొరుకుడు పడ్డం లేదు. ఇతర జిల్లాల్లో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసలువస్తోంటే ఈ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ కీలక నేత పాలక బి.ఆర్.ఎస్.లో చేరడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ మాంచి జోష్ఉం మీద కనిపిస్తోంది. . అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఆ పార్టీలో కుదుపులు ఎక్కువవుతున్నాయి. హస్తం నీడకు కొత్తవారు రాకపోగా ఉన్నవారు జారిపోయే పరిస్థితులు కొన సాగుతున్నాయి. ఏకంగా డీసీసీ అధ్యక్షుడే పార్టీ వీడిపోవడంతో జిల్లా పార్టీ ఒక్కసారిగా కుదుపునకు లోనైందనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆ నేత పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాక, డీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న కుంభం అనిల్‌కుమార్ రెడ్డి హఠాత్తుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి గులాబీ గూటికి చేరిపో యారు. మంత్రి జగదీష్‌రెడ్డి వెంటరాగా..హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారే రోజు ఉదయం వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పిన అనిల్‌కుమార్ సాయంత్రానికి హస్తానికి టాటా చెప్పి కారెక్కి వెళ్ళిపోయారు. ఈ పరిణామం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర సంచనలం రేపింది.
నెల రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపానికి గురైన అనిల్‌కుమార్…చివరికి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారని భువనగిరి పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. భువనగిరి పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టడం, బీజేపీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డిని తనకు పోటీగా కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడంతో అనిల్‌కుమార్ మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు. జిట్టాతో రేవంత్ టీం మంతనాలు సాగించారని, కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు బాలకృష్ణారెడ్డి కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి జిట్టాకు కాంగ్రెస్ సీటు ఇవ్వడానికి అంగీకరిం చారనే విషయం కుంభం అనిల్‌కుమార్‌కు తెలియడంతో ఆయన ఆగ్రహంతో పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ అన్ని కార్యక్ర మాలు నిర్వ హిస్తుంటే.. బయటి నుంచి మరో నేతను తనకు పోటీగా తీసుకురావడం ఏంటని ప్రశ్నించి నట్లు తెలిసింది. కొత్తనేతను తీసుకువస్తు న్నపుడు డీసీసీ చీఫ్‌గా ఉన్న తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. జరుగుతున్న అని పరిణామాలతో మనస్తాపానికి గురైన అనిల్‌కుమార్‌కు సీనియర్ నేతల నుంచి కూడా మద్దతు రాకపోవడం..మరోవైపు కార్యకర్తల ఒత్తిడితో బీఆర్ఎస్‌లో చేరిపోయారని తెలుస్తోంది.
ఇంతకాలం భువనగిరి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న అనిల్ కు బీఆర్‌ఎస్ నుంచి లభించిన హామీ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే అక్కడ పైళ్ల శేఖర్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అనిల్‌కుమార్‌ను భువనగిరి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయించే ఆలో చనలో ఉన్నారట గులాబీ పార్టీ బాస్. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారడంతో అక్కడ బీఆర్ఎ స్ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేడు. ఈ నేపథ్యంలోనే అనిల్‌ను లోక్‌సభ బరిలో నిలపాలన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చిందట. అనిల్ గులాబీ కండువా కప్పుకున్న వేదికపై నుంచే అనిల్ రాజకీయ భవిష్యత్తు బాధ్యత తనదే అని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో… ఎమ్మెల్సీ లేకపోతే ఎంపీగా పోటీచేసే అవకాశం అనిల్‌కు రానుందని బీఆర్ఎస్ నేతలు చర్చించు కుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నల్లగొండ జిల్లాలో రాజకీయం హీటెక్కుతోంది. మరో రెండు వారాల్లో పలువురు కాంగ్రెస్ కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారనే ప్రచారం మొదలైంది. గోడ దూకుళ్ళు,