అమెరికా అంతరిక్షనౌక ఒడిస్సియస్ విజయవంతంగా చంద్రుడిపై అడుగు పెట్టింది. అపోలో శకం ముగిసిన తర్వాత అంటే దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ఓ అమెరికన్ వ్యోమనౌక చంద్రుడిపై దిగింది. నాసా ఆర్థిక సహకారంతో హోస్టన్ కు చెందిన ఇంట్యూటివ్ మిషిన్స్ నిర్మించిన ఒడిస్సియస్ అనే కమర్షియల్ రోబో స్పేస్ షిప్.. విజయవం తంగా చంద్రుడిపై దిగింది. ఒడిస్సియస్ చంద్రుడి దక్షిణధ్రువం సమీపంలో గురువారం విజయవంతంగా దిగింది. ఒడిస్సియస్ విజయవంతం కావడంతో అమెరికా వ్యోమగాములు ఈ దశాబ్ది చివర్లో మళ్లీ చంద్రుడిపై యాత్రలు సాగించే మార్గాన్ని సుగమం చేసింది. ఫ్లైట్ కంట్రోలర్లు ప్రయోగాత్మక ల్యాండింగ్ వ్యవస్థకు మారాల్సి రావడంతో రేడియో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి కొద్ది నిముషాలు పట్టడంతో కొద్దిసేపు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా చంద్రుడిపై అడుగు పెట్టిందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ప్రకటించారు.