ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేశ్… జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ఆయన.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్‌లా ఉంటుందని లోకేశ్ సెటైర్లు వేశారు.