ఎన్నికల ముందు పాకిస్థాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం బలూచిస్థాన్‌లో రెండు వేర్వేరు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. 52 మందికి పైగా గాయాల పాలయ్యారు. గురువారం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తొలి బాంబు పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం బయట పేలింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా… 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగులో బాంబును అమ ర్చి ఘటనాస్థలిలో పెట్టి వెళ్లారని… తర్వాత రిమోట్‌తో దాన్ని పేల్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన జరిగిన గంటలోపే మరో బాంబు… అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలోని ఖిలా అబ్దుల్లా ఏరియాలోని జమియత్ ఉలేమా ఇస్లామ్, పాకిస్థాన్ ఎన్నికల కార్యాలయం దగ్గర పేలింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పో గా… 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఆపేందుకు ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థు లను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ అన్నారు. బలూచిస్థాన్‌లో మరింత భద్రతను పెంచుతామని ఎన్నికల సంఘం పేర్కొంది.ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్… నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనుంది. ఎన్నికల రోజున మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


