జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంపై సోరెన్ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. తమ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేందుకు అవసరమైన బలం ఉందని నిరూపించుకుంది. అంతకు ముందు ముఖ్యమంత్రి చంపై సోరెన్ తమ ప్రభుత్వాన్ని బలపరచవలసిందిగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి చంపై సోరెన్…హేమంత్ సోరన్ తమ ప్రభుత్వం బలం అని స్పష్టం చేశారు. తాను హేమంత్ సోరెన్ పార్ట్ నెంబర్ 2 గా చెప్పుకోడానికి గర్వపడుతున్నానని సీఎం చంపై సోరెన్ అన్నారు. హేమంత్ సోరెన్ ను తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని సీఎం విమర్శించారు.
దేశ చరిత్రతో తొలిసారి ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడంలో రాజ్ భవన్ కూడా మిలాఖత్ అయిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఫ్లోర్ టెస్ట్ కు ముందే గవర్నర్ సిపి రాథాకృష్ణన్ ప్రసంగించారు. జైలులో ఉన్న హేమంత్ సోరెన్ ను కోర్టు అనుమతితో అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా తీసుకువచ్చారు. మాజీ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్ కూడా ప్రభుత్వం బలనిరూపణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సభలోకి వస్తుండగా హేమంత్ సోరెన్ జిందాబాద్ అని జేఎంఎం సభ్యులు నినాదాలు చేశారు. అంతకు ముందు హైదరాబాద్ లో రిసార్ట్ లలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ‘మహాకూటమి’ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి తిరిగి వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వం బల పరీక్షలో పాల్గొన్నారు.