సంక్రాంతి తరువాత వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నాలుగో జాబితా వెలువడనుంది. పదిహేను అసెంబ్లీ స్థానాల్లో మార్పులు వుండే అవకాశముంది. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, తిరువూరు, పెందుర్తి, ఆళ్ల గడ్డ, గోపాలపురం, కొవ్వూరు, నంది కొట్కుర్, మడకశిర, శింగనమలతో పాటు… ఎస్.కోట, చౌడవరం, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు వుండే అవకాశం ఉంది. మార్కాపురం- జంకే వెంకట్ రెడ్డి, కనిగిరి.. కదిరి బాబు రావు, గిద్దలూరు… అన్న రాంబాబు లేదా బాలినేనికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కందుకూరు…. బర్రా మధు సూధన్ యాదవ్, తిరువూరు… నల్ల గట్ల స్వామి దాస్, పెందుర్తి… అదీప రాజ్ లేదా మంత్రి గుడివాడ అమర్ నాథ్‌కు ఇచ్చే అవకాశం ఉంది. గోపాల పురం… మంత్రి తానేటి వనిత, కొవ్వూరు …తలారి వెంకట్ రావు, మడకశిర… శుభ కుమార్, సింగణమల… యామిని బాలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


