24.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా… ఇవాళ ఉదయం 10 :16 గంటలకు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు సీఎం జగన్. ఈ సందర్భంగా తెలుగు తల్లికి అలాగే అమరాజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అలాగే ఇతర అధికారులు పాల్గొంటారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఘనంగా జరుపనున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్