16.7 C
Hyderabad
Monday, January 19, 2026
spot_img

ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదాం– బండి సంజయ్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదామని బీజేపీ నేత బండి సంజయ్ పిలుపునిచ్చారు. అశోక్‌ నగర్‌ లో ప్రవళిక ఆత్మహత్య పై బండి సంజయ్ స్పందించారు. అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది….కానీ, నిరుద్యోగ యువతా….! ఆత్మహత్యలు వద్దన్నారు. ఆశ, ఆశయం, ఉరకలెత్తెన ఉత్సాహం, ఉరిమి తరిమిన మీ పౌరుషంతోనే తెలంగాణ సాకారం అయిందని వెల్లడించారు.

అమరుల ఆకాంక్షల సారథులైన మీరు, ఒక్క కుటుంబం నిరంకుశత్వానికి నిరాశపడితే…ఆత్మబలిదానాలు చేసిన అమరులను అవమానించడమేన్నారు. నోటిఫికేషన్లు రాక, వచ్చినా వాయిదాలు పడుతూ, పేపర్‌ లీకులు, కోర్టు కేసులతో మీలో నిరాశ నిండుకుంటోందని తెలుసు అని చెప్పారు బండి సంజయ్‌. కానీ, ఆ నిరాశ మీ సత్తువను కమ్మేయకూడదు.నిరంకుశత్వాన్ని నిగ్గుతేల్చే నిప్పు కణికలా ఎగిసిపడాలని పిలుపునిచ్చారు. బిజెపి మీ వెంటే ఉంటుంది. మీకోసం పోరాడుతుంది. మంచి రోజులు మన ముందే ఉన్నాయి…దొరల అరాచక పాలనను గద్దెదించి సత్తా చాటుదామన్నారు. మరొక్కసారి బరువైన గుండెతో కోరుతున్నా…ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదామని పిలుపు నిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్