స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటికి బయలుదేరిన సీఎం కేసీఆర్ కాన్వాయ్.. కాసేపటి క్రితమే… వేల్పుర్ లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృ ముర్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. అలాగే.. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృ మూర్తికి సీఎం కేసీఆర్ నివాళు అర్పించారు. అటు ప్రశాంత్ రెడ్డిని ఓదార్చిన సీఎం కేసీఆర్….మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఇక సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులు ఐకె రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత.. ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ రానున్నారు.