స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్‌కు భారీ ఊరట లభించింది. లోకేష్‌పై స్కిల్ స్కామ్ కేసును క్లోజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదని కోర్టుకు తెలిపింది సీఐడీ. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపింది సీఐడీ. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు ధర్మాసనం. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం గురువారం వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు రాగా.. సీఐడీ ఇచ్చిన సమాధానం విని, కేసును క్లోజ్ చేసింది ధర్మాసనం.
మరోవైపు ఇదే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వాదనలను ఈ నెల 17వ తేదీన వింటామని తెలిపింది హైకోర్టు ధర్మాసనం. కాగా, స్కిల్ స్కామ్ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌ను విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫున లాయర్స్. సీఐడీ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు తరఫఉన దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.