37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

Bigg Boss 7 Elimination: ఇది కదా ఉల్టా పల్టా అంటే.. హౌస్ నుంచి శుభశ్రీ అవుట్..?

స్వతంత్ర వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారానికి చేరింది. ఇప్పటికే హౌజ్​ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల, రతికా రోజ్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు ఐదో వారం ఎలిమినేషన్​ కోసం రంగం సిద్ధమైంది. మొత్తం ఏడుగురు నామినేట్​ అయ్యారు. మరి, వీరిలో ఈవారం హౌస్​ నుంచి ఎవరు బ్యాగ్ సర్దేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట ఇప్పటి నుంచి టాప్ గేరు వేయనుంది. హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు. సాధారణ వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లా కాకుండా ఉల్టా పుల్టా సీజన్ లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఒకేసారి హౌస్ లోకి పంపుతున్నారు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ 2.0 జరగనుంది. ఉల్టా పుల్టా అని చెబుతున్న ట్యాగ్ లైన్ కి ఇప్పుడు సార్ధకత చేకూరనుంది. అయితే వీకెండ్ లో ఎవరు ఎలిమినేషన్ అనే ప్రశ్న ఉంటూనే ఉంటుంది. ఈ వీక్ అందరికీ షాకిస్తూ శుభశ్రీ రాయగురుని ఎలిమినేట్ చేసినట్లు టాక్ వస్తోంది.

మామూలుగా ఈ వీక్ లో ఎలిమినేషన్ విషయంలో చాలానే గాసిప్స్ వస్తూ ఉన్నాయి. కొందరు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఇంకొందరు ముగ్గురిని ఎలిమినేట్ చేసి.. ఇద్దరిని ఇంటికి పంపి, ఒకరిని మాత్రం సీక్రెట్ రీమ్ లో ఉంచుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే అలాంటివి ఏమీ ఉండవని సమాచారం. కేవలం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది కూడా శనివారం ఎపిసోడ్ లోనే ఉంటుందని తెలుస్తోంది. నటి, లాయర్, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముద్దుగుమ్మ శుభశ్రీ రాయగురు ఈ వీక్ ఎలిమినేట్ అయినట్లు లీకు వీరులు పోస్టులు చేస్తున్నారు.

అయితే ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. సుబ్బు, ప్రియాంక, టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నారని అనధికారిక పోలింగ్ లో తెలుస్తోంది. వారిలో మరీ ముఖ్యంగా టేస్టీ తేజ అందరికంటే తక్కువ ఓట్లతో లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడని చెబుతున్నారు. కానీ, తేజాకి లెటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లు అనిపిస్తోంది. మరో వైపు శుభశ్రీ.. ప్రిన్స్ యావర్ తో కలిసి డబుల్ గేమ్ ఆడుతోంది అనే నెగిటివ్ ప్రచారం ఉంది. వాళ్లిద్దరు అందరి ముందు ఒకలా ఉండి.. తర్వాత సీక్రెట్ గా గేమ్ ప్లాన్స్ వేస్తూ చాలాసార్లు కనిపించారు. అందుకే అది సుబ్బుకి బ్యాడ్ అయింది.

అంతేకాకుండా ఆమె లెటర్ ని చాలా ఈజీగా త్యాగం చేసింది. గౌతమ్ గెలిచి సేవ్ చేస్తా అంటూ మాటిచ్చాడు. కానీ, గౌతమ్ ఓడిపోయాడు. అదే వీక్ సుబ్బు ఎలిమినేట్ అయితే గౌతమ్ కి ఆ గిల్ట్ కచ్చితంగా ఉంటుంది. గౌతమ్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యాను అనే భావన సుబ్బుకి కచ్చితంగా ఉంటుంది. కాబట్టే శుభశ్రీని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరోవైపు టేస్టీతేజ ఈ వీక్ స్ట్రాంగ్ అయ్యాడనే చెప్పాలి. ఆ విధంగా చూసుకున్నా కూడా సుబ్బు ఎలిమినేట్ కాక తప్పదు.

అయితే ఒక సీజన్ లో ఐదు వారాలు ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ హిస్టరీ లో ఇదే తొలిసారి. ఉల్టా పుల్టా సీజన్ లో అన్నీ ఉల్టాగా జరుగుతున్నాయి. గ్రాండ్ లాంచ్ 2.0, ఐదు వారాలు ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్, కొత్త కొత్త టాస్కులు, ఎప్పటికప్పుడు రూల్స్ మార్చేయడం. ఇలా అన్నీ కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. మరి.. సీజన్ మొత్తం ఇలాంటి ట్విస్టులను కొనసాగిస్తారా? కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత మళ్లీ నార్మల్ సీజన్ లా మారిపోతుందా అనే విషయం తెలియాలి అంటే.. కాస్త వెయిట్ చేయాల్సిందే. మరి..

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్