19.7 C
Hyderabad
Wednesday, December 3, 2025
spot_img

రామ్ గోపాల్ వర్మను కలిసిన ‘చీటర్’ మూవీ టీం

రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘చీట‌ర్‌’. బర్ల నారాయణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ పతాకంపై పరుపాటి శ్రీనివాసరెడ్డి , కటారి రమేష్ యాదవ్  నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో సినిమా యూనిట్ రామ్ గోపాల్ వర్మని కలిశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘‘‘చీటర్’ సినిమా ట్రైలర్ చూశాను బాగుంది, డైరెక్టర్‌కి టీం మెంబర్స్‌కి ఆల్ ది బెస్ట్, రేఖ మా వ్యూహంలో షర్మిల పాత్ర చేసింది.’’ అని చెప్పారు.

నిర్మాత శ్రీనివాస రెడ్డి, కటారి రమేష్ యాదవ్  మాట్లాడుతూ సినిమా అద్భుతంగా వ‌చ్చింద‌న్నారు. తమ టీంకి రామ్ గోపాల్ వర్మ బ్లెసింగ్స్ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ద‌ర్శ‌కుడు చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన‌ట్లు చెప్పారు. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్‌ను 12ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించిన‌ట్లు చెప్పారు. సెప్టెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు ఈ సినిమాను తీసుకువ‌స్తున్న‌ట్లు చెప్పారు.

ద‌ర్శ‌కుడు నారాయణ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌క‌ెక్కించిన‌ట్లు చెప్పారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలు ఉన్న‌ట్లు తెలిపారు. సినిమాను థియేట‌ర్ల‌లో చూసి ఆద‌రించాల‌ని కోరారు. అలానే రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖ డైరెక్టర్ తమ టీంకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్