స్వతంత్ర వెబ్ డెస్క్: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది.
తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఇదే కేసులో నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడని నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై హీరో నవదీప్ కూడా స్పందించాడు. ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదని, ఆ పేరు తనది కాదని ఆయన టచ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే డ్రగ్స్ వాడిన నిందితులను నార్కోటిక్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మోడల్ శ్వేతా ఇంకా పరారీలోనే ఉన్నారని సమాచారం.
హైదరాబాద్‌లో మళ్లీ ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో పలు పబ్‌ల పైనా నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఈ కేసులో డీలర్ బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌లతోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారు.