రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా నుంచి ‘డీజే పిల్లా..’ పాటను విడుదల చేశారు. ‘డీజే పిల్లా..’ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా వైషాగ్ పాటను పాడారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నారు.
సాంగ్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ “మా ‘శశివదనే’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందించాం. మంచి లవ్ మూవీ వచ్చి చాలా రోజులువుతుందని అందరూ అనుకుంటున్నారు. వారి కోరిక ఈ సినిమాతో తీరుతుందని అనుకుంటున్నాను. మా మీరో రక్షిత్, హీరోయిన్ కోమలి ప్రసాద్ సినిమాలో అలా ఒదిగిపోయారంతే. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం” అన్నారు.
నటీనటులు:
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్
సాంకేతిక వర్గం:
సమర్పణ: గౌరి నాయుడు
బ్యానర్స్: .జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్
నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి
సీఈవో: ఆశిష్ పెరి,
రచన, రద్శకత్వం: సాయి మోహన్ ఉబ్బన
సంగీతం: శరవణ వాసుదేవన్
సినిమాటోగ్రఫీ: సాయికుమార్ దారా
ఎడిటర్ : గ్యారీ బి.హెచ్
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)


