19.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

నిరీక్షణకు తెర.. నేడే భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానుల నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ అనంతరం ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే కానుంది. దీంతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఆసియా కప్​లో పాక్​పై గ్రూప్ దశలో గెలిచిన భారత్.. సూపర్​-4లో మాత్రం ఓటమిపాలైంది. దీంతో ఎలాగైనా దాయాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈమధ్య పాక్ జట్టు మరింత బలంగా తయారైన నేపథ్యంలో ఈ మ్యాచ్​లో టీమిండియా గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది.

కీలకమైన ఇండో-పాక్ సమరానికి ముందు మాటల యుద్ధం కూడా హైలైట్ అవుతోంది. ఆసియా కప్​తో పాటు రాబోయే వన్డే వరల్డ్ కప్​లోనూ భారత్​ను ఓడిస్తామని పాక్ మాజీలు, ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ మాటలతో రెచ్చిపోతున్నారు. అయితే ఇరు జట్ల మేనేజ్​మెంట్ మ్యాచ్​లో ఎలా నెగ్గాలా అని వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయాయి. కాగా, మ్యాచ్​కు సర్వం సిద్ధమైన తరుణంలో వరుణుడు అందోళన కలిగిస్తున్నాడు. భారత్-పాక్ మ్యాచ్​కు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం.. హైబ్రిడ్ మోడల్​ను అనుసరించి ఇండో-పాక్ మ్యాచ్​కు శ్రీలంకలోని పల్లెకెలే ఆతిథ్యం ఇస్తోంది.

శ్రీలంకలో ప్రస్తుతం ఓ మోస్తరుగా వానలు పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్ సమయానికి వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. ఒకవేళ వాన ఆటంకం కలిగిస్తే మ్యాచ్​ను టీ20 ఫార్మాట్​లో నిర్వహిస్తారు. మ్యాచ్ అసలే సాధ్యం కాకపోతే ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అదే జరిగితే పాకిస్థాన్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్-4 దశకు చేరుకుంటుంది. మరో బెర్త్ కోసం నేపాల్​తో భారత్ అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. మరి.. మంచి బజ్ నెలకొన్న ఇండో-పాక్ మ్యాచ్​కు వరుణుడు కరుణిస్తాడో లేకపోతే ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతాడో చూడాలి.

Latest Articles

లండన్‌ పర్యటనకు వైఎస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు వెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి కాన్వకేషన్‌ సందర్భంగా జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్