స్వతంత్ర వెబ్ డెస్క్: గుండె పోటు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఊబకాయం ఉన్నవారికి, వయస్సు ఎక్కువగా ఉన్నవారి గుండె పోటు వస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏ వయస్సు వారికైనా హార్ట్ ఎటాక్ వస్తుంది. కరోనా తర్వాత చాలా చిన్న వయస్సువారు కూడా గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా పెద్దపల్లిలో (Peddapalli) విషాదం చోటు చేసుకుంది.
గుండెపోటుతో(Heart attack) మృతి చెందిన అన్నకి అతని చెల్లెలు రాఖీ(Rakhi) కట్టిన సంఘటన పెద్దపల్లి జరిగింది. పెద్దపల్లి – ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్య అప్పటిదాకా సంతోషంగా ఉండి ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దు:ఖంతో కడసారిగా కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.