స్వతంత్ర వెబ్ డెస్క్ : ఇస్రో అంచనాలు తప్పలేదు. చంద్రయాన్-3 (Chandrayaan-3) విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.44కి ల్యాండింగ్ ప్రక్రియ మొదలయ్యింది.
ఇప్పటివరకూ అన్ని దశలనూ సవ్యంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-3 .. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై కాలుమోపడంతో ప్రక్రియ పూర్తయ్యింది. జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్-2 ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠంతో.. అలాంటి తప్పిదాలు లేకుంటే చంద్రయాన్-3ని పక్కాగా రూపొందించినట్లు ధీమా వ్యక్తం చేసిన ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం చంద్రుడిపై దక్షిణ ధ్రువంవైపు ల్యాండ్ కాలేదు. భారత్ ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.


