స్వతంత్ర వెబ్ డెస్క్: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు భరోసా ఇచ్చేందుకు పార్టీ సీనియర్ లీడర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్య కార్యకర్తలతో ఆగస్టు 23న నకిరేకల్ లోని శ్రీనివాస గార్డెన్ లో వీరేశం మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. నకిరేకల్ నుంచి చిరుమూర్తి లింగయ్యకు(Chirumurthi Lingaiah) సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో వీరేశం పార్టీ వీడనున్నట్లుగా తెలుస్తోంది.