స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి లేని మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంత లేబిళ్ల ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదన్నారు.
ఇందుకోసం 131490 మంది టెండర్లలో పాల్గొన్నారని అన్నారు. 22 దుకాణాలకు తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలు కావడం వల్ల వాటికి ప్రస్తుతం టెండర్లు నిర్వహిండం లేదన్నారు. అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.