స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో (Traffic restrictions) ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కట్ట మైసమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్య పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇక ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మైనార్టీ లబ్ధిదారులకు సబ్సిడీ చెక్కులను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు (Minister Harish rao) పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లోని జంక్షన్లను ఉపయోగించకపోవడం మంచిదని అధికారులు సూచించారు. దీంతో వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తెలిపారు.


