స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET ) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కి 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాయడానికి 1,60,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్(Notification) విడుదల అవ్వగా, విద్యాశాఖ (Education Department)2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనుండగా.. డీఈడీ(DED), బీఈడీ(BED)అభ్యర్థులు పేపర్-1 పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.