స్వతంత్ర వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, వారాహి(Varahi) ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ , చంద్రబాబు(Chandrababu) ఇద్దరిలో అసహనం కనిపిస్తోందన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని అంబటి ఆరోపించారు. పట్టిసీమ పేరుతో దోపిడీ చేశారని రాంబాబు పేర్కొన్నారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు.
రూ.834 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని.. చంద్రబాబు కేవలం దోపిడీ కోసమే కొన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. ఎల్లో మీడియా(YellowMedia) పిచ్చిపిచ్చి రాతలు రాస్తోందని.. ఈనాడు(Enadu) కక్షపూరితంగా కథనాలు ప్రచురిస్తోందని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండను(Rushikonda) సందర్శించే పేరుతో హడావుడి చేశారని.. కొండలను తొలగించి ఇళ్లు కట్టుకోవడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాంబాబు స్పష్టం చేశారు.