స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్(CM KCR) జిల్లాల పర్యటనల షెడ్యూల్ ఫిక్సయ్యింది. డిసెంబర్(December) నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ.. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీస్కెళ్లేలా.. అటు ప్రత్యర్ధి పార్టీపై ఎదురుదాడి చేసేలా అంచనా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు రెండు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
ఆగస్టు 19వ తేదీన సీఎం కేసీఆర్ మెదక్(Medak District) జిల్లాలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని(District Police Office) సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఆగస్టు 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన చేపట్టనున్నారు. తన పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు. అదే సందర్భంలో.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభంకానుంది. అనంతరం సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులు, పార్టీ నేతలు ఏర్పాట్లను చేస్తున్నారు.