24.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్‌..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దశాబ్దానికి పైగా పెండింగులో ఉన్న కరీంనగర్ – హసన్‭పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. నూతనంగా నిర్మించనున్న ఈ రైల్వే లైన్‭ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన తర్వాత నిధులు కేటాయింపుతో పాటు రైల్వే లైన్‭ (Railway Line)నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)శుక్రవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్‭ను కలిసి ఈ రైల్వే నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.దీనితో పాటు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో ట్రైన్ ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కేంద్రమంత్రిని కోరగా.. దీనిపై ఆయన సముఖత వ్యక్తం చేశారు. అక్కడ కొత్త స్టేషన్ ఏర్పాటుతో పాటు ట్రైన్లు ఆగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. 2013లో ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. అందువల్లే ఈ రైల్వే లైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్‭లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణను అభివృద్ధి చేయాలని అన్నారు. దాదాపు 62 కి.మీల పొడవు గల కరీంనగర్ -హసన్‭పర్తి రైల్వే లైన్‭ నిర్మాణం పూర్తయితే.. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.

Latest Articles

సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు

సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బౌన్సర్ల అంశాన్ని ప్రత్యేకంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులకు చూపించారు ముఖ్యమంత్రి రేవంత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్