స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం అయింది. ప్రత్యేక వాహనాన్ని పూలతో అలంకరించి గద్దర్ అమర్ రహే అనే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అశేష జనవాహని నడుమ విప్లవ జోహార్లతో గద్దర్‌కు ప్రజలు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. గద్దర్ అంతిమయాత్ర దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల గుండా తరలిస్తున్నారు.
కాగా గద్దర్ పార్ధీవదేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెవెళ్లనున్నారు. అనంతరం ఇంటి వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. అల్వాల్‌లోని మహాభోది స్కూల్ గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎ కేసీఆర్ పాల్గొంటారు. చివరి సారిగా గద్దర్ ను చూసేందుకు ఆయన అభిమానులు తరలివస్తున్నారు.