25.5 C
Hyderabad
Friday, March 14, 2025
spot_img

‘టిల్లు స్క్వేర్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

డీజే టిల్లు సినిమాతో యువతకు బాగా దగ్గరైన సిద్ధు జొన్నలగడ్డ.. స్టార్ బాయ్‌గా ఎదిగాడు. ఆ చిత్రం తెలుగు చిత్రసీమలో కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. టిల్లు అన్నగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన సిద్ధు.. ఇప్పుడు మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ ‘టిల్లు స్క్వేర్‌’తో వస్తున్నాడు. మరోసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చూడబోతున్నాం. ఈసారి వినోదం మొదటి దానికి రెట్టింపు ఉంటుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే హామీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతకాలపై సూర్యదేవర నాగ వంశీ డీజే టిల్లుకు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

డీజే టిల్లు చిత్రంలోని సంగీతం యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన “టిల్లు అన్న డీజే పెడితే” పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, అది టిల్లు పాత్రకు గుర్తింపుగా మారింది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ కోసం కూడా రామ్ మిరియాల సరికొత్త పాటను స్వరపరచి ఆలపించారు.

ఈ పాట జూలై 26న సాయంత్రం 4:05 గంటలకు విడుదలైంది. మాస్ బీట్స్‌తో కాలు కదిపేలా హుషారుగా సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. “టిల్లు అన్న డీజే పెడితే” పాట లాగానే, “టికెట్ ఏ కొనకుండా” పాట కూడా పార్టీలు, పబ్‌లు అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది.

టిల్లు స్క్వేర్ చిత్రం డీజే టిల్లుకి మించి సరికొత్త వినోదాన్ని అందించబోతుందని స్పష్టమవుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సాంగ్ ప్రోమోలో ఆమె లుక్, టిల్లుతో ఆమె సంభాషణ వైరల్‌గా మారాయి. మొత్తానికి ఈ పాట టిల్లు స్క్వేర్ పై ఇప్పటికే ఏర్పడిన అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొదటి పాట ‘టికెట్ ఏ కొనకుండా’ను రామ్ మిరియాల స్వరపరచడంతో పాటు ఆలపించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

చిత్రం పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు, అనుపమ పరమేశ్వరన్
దర్శకుడు: మల్లిక్ రామ్
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్