స్వతంత్ర వెబ్ డెస్క్: నటి, నిర్మాత మెగా డాటర్ నిహారిక కొణిదెలపై వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయారు. 2020లో డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్న వీరు.. ఆతర్వాత కూడా చాలా అన్యున్యంగా కనిపించరు. వెకేషన్స్ కు వెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అనుకునేలోగా ఊహించని షాక్ ఇచ్చారు. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. తాజాగా ఈ జంట మ్యూచ్యువల్ డైవోర్స్ కి అప్లై చేయగా.. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై ఇప్పుడు నిహారిక ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు. ‘‘నేను, చైతన్య పరస్పర అగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నా వెన్నంటే ఉండి.. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన నా కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ పరిణామాల అనంతరం మా జీవితాల్లో మేం ముందుకు వెళ్లేందుకు మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నన్ను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు.ఇక చైతన్య కూడా ఇదే విధంగా పోస్ట్ పెట్టాడు. ఇక వీరిద్దరి విడాకులకు కారణాలు మాత్రం తెలియలేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక తాజాగా డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.