23.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

రంగారెడ్డి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా 3000 మంది దివ్యాంగులు యోగా చేశారు. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా చేసినందుకు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు డాక్టర్‌ వీరేంద్రకుమార్‌, ఎ.నారాయణస్వామి పాల్గొన్నారు. వారితో పాటు శ్రీరామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు కమలేష్‌ డి పటేల్‌ (దాజీ) హాజరయ్యారు. దాజీ నేతృత్వంలో సుమారు 3వేల మంది దివ్యాంగులతో కలిసి కేంద్రమంత్రులు ధ్యానం చేశారు. దివ్యాంగుల సాధికారత విభాగం-దివ్యాంగజన్‌, ఎన్‌ఐఈపీఐడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. వేదికపై ప్రధాని నరేంద్రమోదీ వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్