స్వతంత్ర వెబ్ డెస్క్: అత్యాచారం ఆరోపణలపై విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండేళ్లుగా స్వామిజీ తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ బాలిక విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమంలో పూర్ణానంద సరస్వతీ స్వామీజీపై ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. స్వామీజి చేతిలో చిత్రహింసలు అభవించానని.. అత్యాచారాలకు గురి అయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశ్రమంలో పనిచేసే పనిమనిషి సహాయంతో తప్పించుకున్నానని 15 ఏళ్ల బాలిక జ్ఞానానంద ఆశ్రమంలో సరస్వతీ స్వామీజీ తనను గొలుసులతో బంధించి హింసించి అత్యాచారం చేసేవాడంటూ ఫిర్యాదు చేసింది. స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై స్వామీజీని గత అర్ధరాత్రి విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.
బాలిక ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని పూర్ణానంద స్వామీజీ కొట్టిపడేశారు. ఆశ్రమ భూములను కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, అందులో భాగంగానే కుట్ర చేసి బాలికతో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15న ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.