స్వతంత్ర, వెబ్ డెస్క్: విద్యా కానుక పేరుతో పెద్ద సభ ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు ఆర్భాటాలు చేసుకుంటున్నారని టీడీపీ మాజి ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ప్రయివేట్ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి బస్సులో ప్రజలను తలించారని మండిపడ్డారు. ప్రజా సౌకర్యాల కంటే వీరికి ప్రచార ఆర్భాటాలు కావాలని ఎద్దేవా చేశారు. ఈ నాలుగు సంవత్సరాలుగా పెద కోరపాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తే దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పక్కకి తోసారని అన్నారు. వైసీపీ అభివృద్ధి శూన్యం.. కానీ మాటలు మాత్రం గొప్పగా ఉంటాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలనే వైసీపీ పేరు మార్చి ఇస్తున్నారని అన్నారు. నీ అభివృద్ధిలో 150 కోట్ల నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. చంద్రబాబు ముందు చూపు వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని కొనియాడారు.


