స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన కింద పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. విజయవాడ అశోక్‌నగర్‌లోని టాప్ స్టార్ ఆసుపత్రిలో పార్ధసారథికి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పార్థసారథి అస్వస్థతకు గురైన విషయం తెలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.


