స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో సవలం హనుమాయమ్మ హత్యపై ఏపీ డీజీపీ సహా పలువురికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. దళిత మహిళ దారుణ హత్యపై జోక్యం చేసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్ లకు చంద్రబాబు లేఖలు రాశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం, బడుగువర్గాల హక్కులు హరించబడుతున్న విధానంపై తన లేఖల్లో వివరించారు. హనుమాయమ్మ హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరారు. హత్య ఘటనలో వైసీపీ నేతలకు పోలీసుల సహకారంపైనా విచారణ జరగాలని పేర్కొన్నారు.


