స్వతంత్ర, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థినిలు నిరసనకు దిగారు. గత మూడు రోజులు నుంచి హాస్టల్లో సమస్యలు ఉన్నాయని చెప్పినా కూడా ప్రిన్సిపల్ మరియు వార్డెన్ పట్టించుకోవట్లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట చేయడానికి సిలిండర్ కూడా సమకూర్చలేని పరిస్థితి అంటూ విద్యార్థినిలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే వార్డెన్ కి చెప్పాలని, వార్డెన్ కు చెబితే ప్రిన్సిపాల్ తో చెప్పాలని అనేసరికి ఎం చేయాలో తమకు తోచడం లేదని.. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతోనే ఈ సమస్యలు తలెత్తాయని అంటున్నారు.


