స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్‌బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీంతో ఆయన ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఛలో నాయుడుపాలెంకు పిలుపునిచ్చారు. అయితే వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ కూడా ఛలో టంగుటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
వైసీపీ నేత అశోక్‌బాబు తీరుని నిరసిస్తూ ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు నాయుడుపాలెం నుంచి భారీ ర్యాలీగా టంగుటూరుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎమ్మెల్యే స్వామి చొక్కా చినిగిపోయింది. టంగుటూరు వెళ్లాల్సిందే అంటూ జాతీయ రహదారిపై భైఠాయించి నిరసన వ్యక్తంచేస్తున్నారు. చివరకు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చే యడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


