స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజి మంత్రి, టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులతో కలిసి ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దులతో నాగలి దున్నుతూ పంట పొలంలో కన్నా, అబ్బూరిమల్లి టిడిపి అభిమానులు, కార్యకర్తలు సందడి చేశారు. కన్నా మాట్లాడుతూ.. రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మహానాడులో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మేనిఫెస్టోను ప్రకటించారని తెలిపారు. రైతులకు ఏడాదికి 20వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతులకు అన్ని రకాలుగా అందదండలుగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో టిడిపి అధికారంలోకి రావడం తథ్యమన్న కన్నా.. సైకో పాలన పోవాలి చంద్రన్న పాలన రావాలని పిలుపునిచ్చారు.


