స్వతంత్ర, వెబ్ డెస్క్: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ మ్యాచ్ జూన్ 7న ప్రారంభం కానుంది. లండన్‌లోని ఒవెల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానల్స్‌లో లైవ్ ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ఇక నుంచి అడిడాస్ కంపెనీ భారత జట్టుకి అఫీషియల్ కిట్ స్పాన్సర్‌గా ఉండడంతో టెస్టులతో పాటు వన్డేలు, టీ20లకు కూడా కొత్త జెర్సీలను ఆవిష్కరించారు.
తాజాగా ప్లేయర్స్ ఈ జెర్సీలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుపు, నీలం రంగులో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. ఎడమవైపు ఛాతీపై బీసీసీఐ ఎంబ్లెమ్.. కుడివైపు అడిడాస్ సింబల్‌తో కూడిన ఈ జెర్సీ చాలా మోడ్రన్‌గా ఉంది. అభిమానులు ఈ జెర్సీలు పొందాలంటే రూ.4999 వెచ్చించి అడిడాస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.