స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ గాంధీ భవన్ లో సోనియా గాంధీ కటౌట్ కు పాలాభిషేకం ఏర్పాటు చేశారు. భారీ క్రేయిన్ సహాయంతో ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ , సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పాలాభిషేకం చేశారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరైయ్యారు.
ఈ సందర్భంగా మీరా కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు దేనికోసం కొట్లాడారో.. ఆ లక్ష్యం నెరవేరలేదని అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం చూసి.. కాంగ్రెస్ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసన్న మీరా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్సవాల వేళా.. మీరా బోణం ఎత్తుకుని కనిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీ లు నదీమ్ జావిద్, రోహిత్ చౌదురి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వీహెచ్ పలువురు నేతలు పాల్గొన్నారు.


