స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సూర్యతాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. అధిక ఉక్కపోతతో జనాలు అల్లల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. విజయవాడలో 40 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 42 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు, కొత్తగూడెంలో 40 డిగ్రీలు, భూపాలపల్లిలో 42 డిగ్రీలు, గుంటూరులో 43 డిగ్రీలు, ఏలూరులో 42 డిగ్రీలు, కాకినాడలో 35 డిగ్రీలు, హైదరాబాద్ లో 39 డిగ్రీలు, వరంగల్ లో 41 డిగ్రీలు, సిద్ధిపేటలో 38 డిగ్రీలు, మహబూబాబాద్ లో 42 డిగ్రీలు, కరీంనగర్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


