స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల వినూత్న నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ కోసం కూర్చి వేసి ఆహ్వానం పలికారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలైన ఖానాపూర్ రెవెన్యూ డివిజన్, మహిళ డిగ్రీ కళాశాల, సధర్మాట్ బ్యారేజ్ ద్వారా రైతులకు సాగు నీరు లాంటి హామీలను కుర్చీ వేసుకొని కూర్చొని పనులను చేస్తానన్న కేసీఆర్ కు కూర్చి దొరకలేదా అంటూ… కాంగ్రెస్ నాయకులు కూర్చి వేసి వినూత్న నిరసన చేసి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


