స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం కలకలం రేపుతోంది. భోజనం తిని 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిహార్లోని అరారియా జిల్లాలో జరిగిన ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను భయబ్రాంతులను చేస్తుంది. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వివరించారు. ఓ వైపు అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు బాధపడుతుంటే… మరోవైపు మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టర్ దీనిని సరఫరా చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.


