స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై సీనియర్ సినీ నటుడు సుధాకర్ స్పందించారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని స్పష్టంచేశారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను దయచేసి ప్రజలెవరూ నమ్మకండని విజ్ఞప్తిచేశారు. ఇలాంటి వార్తలు సర్క్యూలేట్ చేసే వారిపై చట్టపర్యంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సుధాకర్ చనిపోయారనే వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి కూడా వెళ్లారు. ఆ సమయంలో కూడా చనిపోయారంటూ తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి సుధాకర్ పై అలాంటి ప్రచారమే సోషల్ మీడియాలో జరుగుతోంది.