స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీమంత్రి వివేకా హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అవినాష్‌రెడ్డి విషయంలో ప్రతిపక్షాలపై మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇప్పటికే అనినాష్ రెడ్డి ఆరుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని.. తన తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి విచారణకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే.. నాటకాలు, డ్రామాలు అని ప్రచారం చేస్తారా? అంటూ మండిపడ్డారు. కేంద్రబలగాలు కూడా వచ్చాయని ప్రచారం చేస్తున్నారు? ఇది సబబేనా అంటూ విరుచుకుపడ్డారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని సీబీఐకి కూడా తెలియజేశారు.. అయినా కూడా ఇలా రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని అన్నారు.