స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నారు. ఇన్నాళ్లు రాజకీయంగా తెరవెనుక ఉన్న వైఎస్ అభిషేక్‌రెడ్డి తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. బుధవారం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి పర్యటించారు. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్‌రెడ్డికి మనవడు అయిన అభిషేక్ రెడ్డి వైజాగ్ లో వైద్య వృత్తిలో స్థిరపడారు. ఇప్పటివరకు బయటకు కనిపించని ఆయన మొదటిసారి ప్రత్యక్షంగా కనిపించడం కడప జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు అభిషేక్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.