స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుండి రాజీలేని రాజకీయాలే చేశానని అన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి. తాను సీఎం వైఎస్ జగన్ ను తప్ప ఇంకెవరిని లెక్క చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఒంగోలు నగరంలో మంగళవారం నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ని ప్రారంభించిన బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఆయన మాట్లాడుతూ ఒంగోలులో పోటీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనకు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఒంగోలేనని అన్నారు. అందుకే తాను ఇక్కడినుండి పోటీ చేస్తానని అన్నారు. వైసీపీలో అయిన వాళ్లే తనపై కుట్రలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నందుకు బాధపడ్డానని వ్యాఖ్యానించారు.


