స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, ఓ కంటైనర్ ఒకటినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందారు. గాయపడ్డ మరొక వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, కారు అతివేగంగా నడపడమే ప్రమాదం జరగటానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.