స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా కిడ్నీ భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాల వద్ద చాలా మంది కిడ్నీ రోగులు బారులు తీరడం.. అధిక సమయం వేచి ఉండాల్సి ఉండటంతో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం జిల్లాలో మరో మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించేందుకు నిర్ణయించింది. మణుగూరులోని గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి, ఇల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అశ్వరావుపేటలో మూడో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే మణుగూరు, ఇల్లందులో బుధవారం ప్రారంభించగా.. అశ్వరావుపేటలో ఈ నెలాఖరు వరకు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉన్న సెంటర్ లు కిడ్నీ రోగులకు సరిపోకపోవడంతో మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేటలో కొత్తగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.