స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మీరు కార్పొరేట్ ఉద్యోగులా? మీకు మందు తాగే అలవాటు ఉందా? అయితే ఇకపై ఎంచక్కా ఆఫీసులోనే తాగొచ్చు. ఎక్కడా అనుకుంటున్నారా? మన దేశంలోనే కాకపోతే హర్యానా రాష్ట్రంలో మాత్రమే. ఇక నుంచి కార్పొరేట్ ఆఫీసు పరిసరాల్లో మద్యం తాగొచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్రంలో నూతన మద్యం విధానం ప్రవేశపెట్టింది.
ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీస్ క్యాంటీన్లలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న బీరు, వైన్ వంటి డ్రింక్స్ తాగేందుకు పర్మిషన్ ఇచ్చింది. జూన్ 12 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుందని తెలిపింది. అయితే ఐదువేల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చని షరతు విధించింది.