స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో బీర్ మినహా అన్ని లిక్కర్ బ్రాండ్లపై ధరలు కిందకు వచ్చాయి. ఫుల్ బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. ఇవాళ్టి నుంచే తగ్గిన ధరలు అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు అధికంగా ఉండడంతో బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అక్రమ మద్యం రవాణా నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.