స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో కలకలం రేపింది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హై కోర్టు గేటు నెంబర్ 6 వద్ద నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతున్ని హై కోర్టుకు సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న మిథున్ గా గుర్తించారు. జనం చూస్తుండగానే కత్తితో పొడిచి దుండగుడు హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగి పోయాడు. హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అయితే నిందితుడు ఇంత కక్ష పూరితంగా హత్య చేయడంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


