స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో తుదిశ్వాస విడిచారు. ఈమేరకు అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. ఫిబ్రవరిలో కొల్హాపూర్ కు వచ్చిన అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన ఆయన ఇవాళ ఉదయం ఇంట్లోనే కన్నుమూసినట్లు తెలిపారు. కాగా మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్ గాంధీ, సుశీల మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ ఏప్రిల్ 14,1934 సంవత్సరంలో జన్మించారు. సామాజకి కార్యకర్తగా, రచయితగా తాత గాంధీజీ అడుగుజాడల్లోనే ఆయన పయనించారు.